కుల, మతాలకు అతీతంగా నిర్వహించుకునే పండుగ హోలీ

0చూసినవారు
కుల, మతాలకు అతీతంగా నిర్వహించుకునే పండుగ హోలీ
30వ వార్డు కౌన్సిలర్ కారింగుల ఉమా అంజన్ గౌడ్ మాట్లాడుతూ, హోలీ పండుగ కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునేదని అన్నారు. మంగళవారం రాజీవ్ నగర్ వీధిలో ఘనంగా జరిగిన హోలీ సంబరాల్లో ఆమె మాట్లాడుతూ, హోలీ అంటే అగ్నితో పునీతమైనదని, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆప్యాయంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలని, సురక్షిత ప్రాంతాల్లోనే స్నానాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్