భార్య వదిలి వెళ్ళిందని మనస్తాపంతో భర్త ఆత్మ హత్య

1372చూసినవారు
భార్య వదిలి వెళ్ళిందని మనస్తాపంతో భర్త ఆత్మ హత్య
కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన షేక్ సైదా (31) కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న సైదాకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం కుటుంబ సమస్యల కారణంగా భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లడంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లోని బెడ్‌రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి జానీ మియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్‌కే యాకూబ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్