కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ విభాగం ప్రారంభం

0చూసినవారు
కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ విభాగం ప్రారంభం
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఇన్‌పేషెంట్ విభాగాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి శనివారం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసిందని, రూ. 26 కోట్లతో నూతన భవన నిర్మాణం, రెనోవేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్