ఇన్సూరెన్స్అడ్వైజర్ శ్రీనివాస్ కు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు

0చూసినవారు
ఇన్సూరెన్స్అడ్వైజర్ శ్రీనివాస్ కు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు
కోదాడకు చెందిన సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎస్. ఎస్. శ్రీనివాసరావుకు ఇన్సూరెన్స్ రంగంలో ఉత్తమ సేవలకు గాను బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు లభించింది. ఏప్రిల్ నెలలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నెల 19న వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు కళాక్షేత్రంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో సంస్థ ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డుతో పాటు గోల్డ్ మెడల్‌ను అందజేయనున్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం, నిరంతర శ్రమతో పనిచేయడం వల్లే ఈ గుర్తింపు దక్కిందని శ్రీనివాసరావు తెలిపారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్