కోదాడ పట్టణంలో ఈనెల 10వ తేదీన జరిగే బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని పురపాలక సంఘం ప్రథమ పౌరురాలు ఎర్నేని కుసుమ బాబుకు బొడ్రాయి పునప్రతిష్ట కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ప్రతిష్ట మహోత్సవానికి తమ సహాయ సహకారాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్ట కమిటీ అధ్యక్షులు నాగబండి లక్ష్మయ్యతో పాటు పలు కమిటీల సభ్యులు పాల్గొన్నారు.