సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలు అందించిన అనంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వృద్ధాప్యంలోనూ క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ అన్నారు. ఆదివారం విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సూర్యాపేట జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలను ఆయన ప్రారంభించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, విశ్రాంత ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని క్రీడలు, విద్యలో రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా, కోదాడ యూనిట్ నాయకులు పాల్గొన్నారు.