బుధవారం కోదాడలో జరిగిన జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశంలో, రాష్ట్ర కో-ఆర్డినేటర్ మేకల సతీష్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన తెలంగాణలో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేసి, పలు గ్రామాల్లో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు.