మునగాల పరగణాలో సీపీఎం పార్టీ నిర్మాణంలో ఉప్పుల కాంతా రెడ్డి సేవలు చిరస్మరణీయం అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మేదర మెట్ల వెంకటేశ్వరరావు, కోదాడ పట్టణ కార్యదర్శి ముత్యాలు తెలిపారు. శుక్రవారం కోదాడలో కాంతా రెడ్డి మూడవ వర్ధంతిని నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన నిఖార్సయిన నాయకుడని వారు కొనియాడారు.