కోదాడలో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కత్రం కబడ్డీ లీగ్’ బ్రోచర్‌ను బుధవారం పబ్లిక్ క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ నెల 16 నుంచి కోదాడ, అనంతగిరి, చిలుకూరు, నడిగూడెం, మునగాల, మోతే మండలాల్లో సెలక్షన్ కం టోర్నమెంట్‌లు నిర్వహించి, అనంతరం మే 4, 5న కోదాడ బాయ్స్ హైస్కూల్‌లో నియోజకవర్గ స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, నామా నరసింహారావు, కత్రం సీతారాంరెడ్డి, ఎంఇఓ సలీం షరీఫ్, వేనేపల్లి శ్రీనివాసరావు, శివనాథ్ రెడ్డి, పోటు రంగారావు, ముత్తవరపు రామారావు, కత్రం కిరణ్ రెడ్డి, ముడియా సత్యనారాయణ, బుడిగ రామాంజనేయులు పాల్గొన్నారు.