సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం ఖానాపురం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ లాజర్, ఉపసర్పంచ్
జగన్ ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం పద్మావతి, కోదాడ మత్స్యశాఖ డైరెక్టర్ రామారావు, ఆశా కార్యకర్తలు ముత్యాలరాణి, స్వాతి పాల్గొన్నారు.