కోదాడ, ఎంఈఓ సలీం షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం, పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కోదాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 87 మంది విద్యార్థులకు గాను 86 మంది ఉత్తీర్ణత సాధించి, 98.85% ఉత్తీర్ణత శాతంతో పాఠశాల అగ్రస్థానంలో నిలిచింది. బలుసు పాటి హరి 572 మార్కులతో కోదాడ మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా ఎంఈఓ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.