కోదాడ మండలంలోని యర్రవరం గ్రామ పరిధిలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి రజని పరిశీలించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు కూడా పాల్గొన్నారు.