కోదాడ పెద్ద చెరువు మత్స్య సొసైటీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. శనివారం నామినేషన్ల గడువు ముగియగా, 9 డైరెక్టర్ల స్థానాలకు గాను, ఎస్సీ కేటగిరిలోని ఒక స్థానం ముగ్గురు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలగడంతో ఏకగ్రీవం అయింది. మిగిలిన ఎనిమిది స్థానాలకు ఈనెల 3న
ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 36 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు సమాచారం. దీంతో
ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.