లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు

3చూసినవారు
లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు
కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వేముల శ్రీను కొద్ది రోజుల క్రితం అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, శ్రీనును క్షేమంగా కోదాడకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్