కోదాడ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

4చూసినవారు
కోదాడ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
బీసీ రిజర్వేషన్ సాధన సమితి కోదాడ పట్టణ నాయకులు మేరిగ రమేష్, బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ ఆర్డీవోకు వినతి పత్రం అందజేస్తూ, బీసీ సబ్ ప్లాన్ కింద 40 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి బీసీల విద్య, వైద్యం, సంక్షేమం, ఉపాధి కోసం ఖర్చు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ రమేష్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్