కోదాడ: చెరువులో పడి యువకుడు మృతి

65చూసినవారు
కోదాడ: చెరువులో పడి యువకుడు మృతి
కోదాడ మండలం కాపుగల్లులో ప్రమాదవశాత్తు కాలుజారి యువకుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాపుగల్లుకు చెందిన గుగ్గిళ్ళ కరుణాకర్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. కరుణాకర్ కు ఏడు సంవత్సరాల క్రితం వివాహం కాగా భార్య నుండి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. బహిర్భూమికి చెరువు వద్దకు వెళ్లి కాలుజారి చెరువులో పడటంతో ఈత రాక మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్