కోదాడ: ఉన్నత లక్ష్యాలను సాధించాలి: మాజీ ఎంపీపీ

85చూసినవారు
కోదాడ: ఉన్నత లక్ష్యాలను సాధించాలి: మాజీ ఎంపీపీ
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించి గ్రామానికి వన్నె తేవాలని అనంతగిరి మండల మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం అనంతగిరి మండలం సింగారంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భావసింగ్, సిహెచ్ శేఖర్, ఉపాధ్యాయులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్