కోదాడ: రాజేష్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలీ

4చూసినవారు
కోదాడ: రాజేష్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలీ
లాకప్ డెత్ కు గురైన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎమ్మార్పీఎస్ ఉద్యమ పోరాటం కొనసాగుతుందని ఆ సంఘం నాయకులు ఏపూరి రాజు మాదిగ స్పష్టంచేశారు. మంగళవారం కోదాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ల రాజేష్ మృతికి బాధ్యులైన పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 10న కోదాడలో జరిగే కర్ల రాజేష్ సంతాప సభ, ర్యాలీకి మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని కుటుంబ సభ్యులు, సంఘం నాయకులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్