కోదాడ మండలం కాపుగల్లు రైతు వేదికలో సోమవారం ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న భూభారతి పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను ప్రజా ప్రతినిధులు, నాయకులు వీక్షించారు. భూభారతి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లు నంబూరి సూర్యం, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, డిసిసిబి మాజీ చైర్మన్ పాండురంగారావు, ఏవో రజని ఉన్నారు.