కోదాడకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా వస్తున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు సోమవారం ర్యాలీకి విస్తృత ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు జిల్లా జనార్దన్ రావు, సాతులూరు హనుమంతరావు, అధ్యక్షుడు గోదేసు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ఉన్నారు.