కోదాడ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

12చూసినవారు
కోదాడ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
బుధవారం అయ్యప్ప మాల స్వీకరించిన కృష్ణానగర్ గ్రామానికి చెందిన భుక్యా బాబునాయక్, సాగర్ ఎడమకాలువలో స్నానం చేస్తుండగా కాలు జారి వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. గురువారం ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో అతని మృతదేహం లభ్యమైంది. నడిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్