కోదాడ బీఆర్ఎస్ ఆ మేడే వేడుకలు

0చూసినవారు
కోదాడ బీఆర్ఎస్ ఆ మేడే వేడుకలు
కోదాడ నియోజకవర్గంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు నయీం నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికుల పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎన్నో త్యాగాలతో సాధించిన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి శ్రమజీవులే ప్రధాతలని, వారి సంక్షేమం కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :