పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరం లాంటిదని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. సోమవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలన్నీ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, కమిషనర్ రమాదేవి ఉన్నారు.