కోదాడ మాజీ సర్పంచ్ పారా సీతయ్య మాట్లాడుతూ, సినీ రంగంలో కోదాడ పేరును వ్యాపింపజేసిన నవ్వుల రేడు వేణు మాధవ్ అని అన్నారు. ఆదివారం కోదాడలో సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వేణుమాధవ్ జయంతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. సినీ కళా రంగాలకు వేణుమాధవ్ మృతి తీరని లోటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెర వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు, సభ్యులు మదీనా మీర, పీర్ సాహెబ్, పాలూరి సత్యనారాయణ, వీరా రెడ్డి, శంకర్ పాల్గొన్నారు.