కోదాడ నయా నగర్ జ్యోతి అపార్ట్మెంట్ వద్ద మంగళవారం కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, బిజెపి సీనియర్ నాయకులు నూనె సులోచనలు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజ శ్రేయస్సు పెరుగుతుందని వారు అన్నారు. వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో డా. బ్రహ్మం, చందర్ రావు, నారాయణ, కృష్ణయ్య, కమిటి సభ్యులు పాల్గొన్నారు.