కోదాడ: ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పాఠాలు

7చూసినవారు
కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్, ఉపాధ్యాయులు డిజిటల్ విద్యను ఆకళింపు చేసుకొని విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. శుక్రవారం కోదాడ పట్టణంలో గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు డిజిటల్ పుస్తకాలపై నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనా పద్ధతులను తెలుసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ రవికుమార్, షరీఫ్, వీరబాబు, వెంకటేశ్వర్లు, గాయత్రి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్