కోదాడలో కె. ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్. ఎస్. ఎస్ విభాగం ఆధ్వర్యంలో మహిళల్లో విద్యాభివృద్ధికి కృషి చేసిన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్. ఎస్. ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, అధ్యాపకులు ఉన్నారు.