కోదాడ: డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి

55చూసినవారు
కోదాడ: డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి
ప్రభుత్వం వెంటనే డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని న్యాయవాది మిరియాల మంగయ్య గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మునగాల మండల కేంద్రంలో డిగ్రీ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతి పత్రం పంపించారు. కళాశాల యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో పరీక్షలు వాయిదా వేశారన్నారు. పరీక్షలు పూర్తి కాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్