కోదాడ: ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ

50చూసినవారు
కోదాడ: ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ
రైతులు తొందరపడి యూరియా కొనుగోలు చేయొద్దని నేటివరకు 16,000 మెట్రిక్ టన్నులు యూరియా, 38,000 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలోప్రణాళిక ప్రకారం సీజన్ పూర్తి అయ్యే వరకు రైతులకు కావలసినంత యూరియా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ ప్రశాంతి, ఏవో రజని ఉన్నారు.

సంబంధిత పోస్ట్