వరి పంటలో ఎరువుల వాడకం తగ్గించాలని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అన్నారు. శనివారం నడిగూడెంలో చల్లుడు పద్ధతిలో సాగు చేస్తున్న వరి పైరును పరిశీలించారు. వాతావరణంలో మార్పుల వల్ల జింక్ శాతం లోపించిందని. సిలేటెడ్ జింకు స్ప్రే చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోదాడ కోదాడ వ్యవసాయ సహాయక సంచాలకులు డి. ఎల్లయ్య, నడిగూడెం ఏఈఓ యన్. పిచ్చయ్య, రైతులు పాల్గొన్నారు.