స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని పీఏసీఎస్ మాజీ చైర్మన్ ముత్తవరపు రమేష్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చౌడం వెంకట రామయ్యకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చేందుకు ఇరు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 50 కుటుంబాలు టీడీపీలోకి చేరాయన్న వార్తలను ఆయన ఖండించారు. తమ పార్టీ నుంచి ఎవరు వెళ్లలేదని, 7 వార్డుల్లో బీఆర్ఎస్, 5 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ఉప సర్పంచ్ పదవితోపాటు ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అవకాశం కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.