కోదాడ పరిధిలోని గుడిబండకు చెందిన శ్రీరాముల తిరపయ్య, ఆవుల వీరబాబులు గొర్రెలను మేపడానికి ముత్యాల బ్రాంచ్ కెనాల్ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు గొర్రెలు కాలువలో పడి కొట్టుకుపోతుండగా, వాటిని కాపాడటానికి ఇద్దరూ కాలువలోకి దూకారు. ఈ క్రమంలో తిరపయ్య అక్కడికక్కడే మృతి చెందగా, నీళ్లలో కొట్టుకుపోతున్న వీరబాబును స్థానికులు బయటకు తీసి వైద్యశాలకు తరలించారు. రెస్క్యూ టీం తిరపయ్య మృతదేహాన్ని కాలువ నుండి వెలికితీసింది.