మునగాల మండలంలో గంజాయిని నిర్మూలించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి రెడ్డి కోరారు. గత ఆరు నెలల కాలం నుంచి మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గంజాయి నిర్మూలనకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి, నాయకులు గంధం సైదులు, ఎస్ఎస్ రావు, మహేష్ ఉన్నారు.