కోదాడ పట్టణంలో విజయదశమి పండుగ సందర్భంగా దుర్గాదేవి పూజా కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక మసీద్ సెంటర్ వద్ద పూల కొట్లలో కొనుగోళ్ల కోసం క్యూలు కనిపించాయి. పూలతో పాటు, మిఠాయి, బట్టల దుకాణాల వద్ద కూడా జన సందోహం నెలకొంది. వివిధ గ్రామాల నుండి ప్రజలు పండుగ సామాగ్రి కొనుగోలు చేయడానికి పట్టణానికి రావడంతో వీధులన్నీ జనంతో కిటకిటలాడాయి.