కోదాడ: కోదాడ ప్రభుత్వ పశు వైద్య శాల తనిఖీ

1చూసినవారు
కోదాడ: కోదాడ ప్రభుత్వ పశు వైద్య శాల తనిఖీ
వ్యవసాయ అనుబంధ రంగాల్లో పశు పోషణ కీలకమని, పాడి పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించామని జిల్లా పశు వైద్య, సంవర్ధక అధికారి డాక్టర్ దాచేపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పశు పోషణలో రక్షణ చర్యలను రైతులకు వివరించారు. అనంతరం పాల దిగుబడికి అవసరమైన ఖనిజ లవణాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెంటయ్య కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్