విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సత్వరం వచ్చేందుకు టాస్క్ శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయని కోదాడ కిట్స్ ప్రిన్సిపల్ డాక్టర్ పి గాంధీ బుధవారం తెలిపారు. కళాశాలలో బిల్డింగ్ ప్లానింగ్ శిక్షణ తరగతులు ముగింపులో ఆయన మాట్లాడారు. ప్రోగ్రామింగ్ పై ట్రైనర్ హేమంత్ కృష్ణ చక్కటి అవగాహన కల్పించారు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డా. సిహెచ్ నాగార్జున్ రావు, విభాగాధిపతురాలు డా. జనార్ధన్ పాల్గొన్నారు.