కోదాడ రూరల్ మండలం దొరకుంట గ్రామంలో, చౌడం వెంకట్రామయ్య ఆధ్వర్యంలో 50 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని కోదాడ తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జి ఓరుగంటి ప్రభాకర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరావు, యాదయ్య, పిట్ల శోభన్ బాబు, ఉండ్రా నరేష్, పాపయ్య, గోవింద్, శ్రీనివాస్, హరిప్రసాద్ పాల్గొన్నారు.