కోదాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు, సమాచార హక్కు సాధన సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తంగెళ్ళపల్లి లక్ష్మణ్, హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన విశ్వజనని ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవ వేడుకల్లో విశ్వజనని సేవారత్న అవార్డును అందుకున్నారు. సమాజంలో సేవలు చేసే వారిని గుర్తించి, అవార్డు అందించడం స్ఫూర్తినిస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.