కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ రావు, పుణ్య క్షేత్రాల దర్శనార్థం ఆర్టీసీ కల్పిస్తున్న బస్సు సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కోదాడలో సర్వమాలధారుల అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు పంచారామ క్షేత్రాలకు లగ్జరీ బస్సు బయలుదేరుతుందని తెలిపారు. పెద్దలకు రూ.1800, పిల్లలకు రూ.1000 ఛార్జీ ఉంటుందని వెల్లడించారు.