కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఆదివారం తిలక్ నగర్ లో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదానాన్ని ప్రారంభించి, అన్నదానాలు పుణ్యకార్యాలని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, భక్తిశ్రద్ధలతో దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్న తిలక్ నగర్ వాసులను అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందని తెలిపారు.