కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9:30 గంటలకు తొగర్రాయిలో సమ్మక్క–సారక్క జాతరలో, 10:30 గంటలకు కోదాడ క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిరిపురంలో గోదా దేవి అమ్మవారి వడిబియ్యం కార్యక్రమంలో పాల్గొని మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 2 గంటలకు CMRF చెక్కులు పంపిణీ చేసి, సాయంత్రం 4 గంటలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గం, అధికారులతో సమావేశమవుతారు.