కోదాడ: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఆఖరి గడువు డిసెంబర్ 7

5చూసినవారు
కోదాడ: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఆఖరి గడువు డిసెంబర్ 7
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు డిసెంబర్ 7 చివరి తేదీ అని లక్ష్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ తెలిపారు. చదువు మధ్యలో మానేసిన వారికి, విద్యార్హత లేకున్నా పదవ తరగతి రాసుకునే అవకాశం ఉందని, పది పాస్ అయినవారు ఇంటర్‌ను ఒక్క ఏడాదిలో పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో చేరవచ్చని, 14 ఏళ్లు నిండినవారు పది పూర్తి చేసుకునే అర్హత ఉందని తెలిపారు. చివరి తేదీకి ముందే అడ్మిషన్లు తీసుకోవాలని కోరారు. వివరాలకు లక్ష్య డిస్టెన్స్ అకాడమీ, బ్రిలియంట్ స్కూల్ పక్కన, నయా నగర్, కోదాడ. ఫోన్: 9542107771, 7981528312.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్