కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల నూతన భవనం నిర్మాణానికి రూ. 1.25 కోట్లు, నియోజకవర్గం లోని 11ప్రాథమిక పశువైద్య కేంద్రాలు , 19 పశు ఆరోగ్య ఉపకేంద్రాలలో అవసరం ఉన్న చోట రూ. 55 లక్షలతో నూతన భవనాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి డా. శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కోదాడలో పశువైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోదాడ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, పశువైద్యాధికారులు ఉన్నారు