నిజ జీవితంలో పనులు సులభంగా పూర్తి చేసేందుకు రోబోటిక్స్ శిక్షణ ఎంతో దోహదపడుతుందని జిల్లా సైన్స్ అధికారి ఎల్ దేవరాజ్ అన్నారు. బుధవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విజిటర్ కౌంటర్, యూజింగ్ డాట్ మాట్రిక్స్, ఎల్ డి ఆర్, కంట్రోల్ డి సి మోటార్, డిస్టెన్స్ ఇండికేటర్ ప్రాజెక్టుల తయారీ శిక్షణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ రేష్మ, చందన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.