కోదాడ: సైన్స్ ఫలాలు ప్రజలకు అందించాలి

2చూసినవారు
సమాజంలో శాస్త్రీయ వైఖరులను పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని ఆ సంఘం రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షుడు డాక్టర్ అంది సత్యం కోరారు. కోదాడలో జరిగిన వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సైన్స్ ఫలాలు ప్రజలకు అందేలా జెవివి బాధ్యులు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సభ్యులు జాఫర్, జిల్లా అధ్యక్షులు రమేష్, కార్యదర్శి సైదులు, ఉపాధ్యక్షులు బడుగుల సైదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :