సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల అరవై తొమ్మిది వేల పశువులకు ఈనెల 14వ తేదీ లోపు టీకా కార్యక్రమం పూర్తి చేయాలని పశు వైద్య శాఖ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ కే అనిల్ కుమార్ ఆదేశించారు. బుధవారం కోదాడ ప్రభుత్వ ప్రాంతీయ పశువైద్యశాలలో ఆయన వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. కోదాడలో ఇప్పటికే 3300 పశువులకు టీకాలు పూర్తి చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెంటయ్య కూడా పాల్గొన్నారు.