కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం - రాయపూడి

954చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం - రాయపూడి
తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం దశాబ్దాల పాటు పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని ఉమ్మడి నల్లగొండ జిల్లా మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం కోదాడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బాపూజీ కీలక పాత్ర పోషించారని, ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారని అన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరం కొనసాగించాలని పిలుపు నిచ్చారు.

సంబంధిత పోస్ట్