బాలాజీ నగర్ లో ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

1285చూసినవారు
బాలాజీ నగర్ లో ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం
కోదాడ నియోజకవర్గం పరిధిలోని బాలాజీనగర్‌లో లంబాడా హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియా నాయక్ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ప్రత్యేక గ్రామపంచాయతీ ఉద్యమం గిరిజనుల్లో చైతన్యం నింపిందని, చేవెళ్ల డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్