రేడియం స్టిక్కర్ల ఛార్జీల పెంపు పై లారీ యజమానుల నిరసన

0చూసినవారు
రేడియం స్టిక్కర్ల ఛార్జీల పెంపు పై లారీ యజమానుల నిరసన
తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 60 ప్రకారం రేడియం స్టిక్కర్లను తప్పనిసరి చేయడం, వాటి అమలులో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరసన చేపట్టింది. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద లారీ యజమానులు రాస్తారోకో, అర్ధనగ్న ప్రదర్శనతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుమారు వెయ్యి రూపాయల ఖర్చుతో పూర్తయ్యే రేడియం స్టిక్కర్లకు ప్రైవేట్ కంపెనీలు 6 వేల నుంచి 8 వేల రూపాయల వరకు వసూలు చేయడం అన్యాయమని వారు ఖండించారు. ఈ నిరసనతో ఖమ్మం రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

ట్యాగ్స్ :