విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు

1277చూసినవారు
విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో సెప్టెంబర్ నెలలో జన్మదినాలు జరుపుకుంటున్న విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావేళ్ల సీతారామయ్య మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యకరమైన అలవాట్లతో వృద్ధాప్య జీవితాన్ని సంతోషంగా గడపాలని, సామాజిక సేవలో భాగస్వాములు కావాలని కోరారు. పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్